అలా ఆడితేనే ధోనీ ఉండాలి.. లేదంటే రిటైర్ అవ్వాలి: అశ్విన్ కీలక వ్యాఖ్యలు
రేపటి నుంచి ఐపీఎల్ 2026 సీజన్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ పాత్రపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఈసారి వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్‌ను సీఎస్‌కే తీసుకోవడంతో ధోనీ భవిష్యత్తుపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించవచ్చనే వాదనలు వినిపిస్తుండగా, టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ అభిప్రాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ధోనీ ఆడితే తుది జట్టులోనే ఉండాలని, లేదంటే పూర్తిగా తప్పుకోవాలని స్పష్టం చేశాడు.
"ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ జాబితాలో ఉండాలనే దానితో నేను ఏకీభవించను. అతను స్క్వాడ్‌లో ఉంటే, తుది జట్టులో కచ్చితంగా ఆడాలి. ఆడటం ఇష్టం లేకపోతే, మొత్తం సీజన్ నుంచి తప్పుకోవాలి. అంతేగానీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటాన్ని నేను సమర్థించను" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. ధోనీ ఆడాలని నిర్ణయించుకుంటే, అతన్ని కాదని చెప్పడం సాధ్యం కాదని, గత మూడు నెలలుగా అతను కఠోర సాధన చేయడమే దీనికి నిదర్శనమని అశ్విన్ అన్నాడు.
ధోనీ బ్యాటింగ్ నైపుణ్యాల కన్నా, మైదానంలో అతని ఉనికి జట్టుకు ఎంతో కీలకమని అశ్విన్ విశ్లేషించాడు. "ధోనీ ఇప్పుడు సీఎస్‌కేకు టాప్ 6 బ్యాటర్ కాకపోవచ్చు. కానీ, అతను కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు మైదానంలో ఒక దిక్సూచిలా వ్యవహరించగలడు. జట్టులో పెద్దన్న పాత్ర పోషించగలడు. ముఖ్యంగా కొత్త బౌలింగ్ లైనప్‌ను నడిపించడంలో ఫీల్డ్ సెట్ చేయడంలో అతని అనుభవం జట్టుకు చాలా అవసరం" అని వివరించాడు.
గత సీజన్‌లో ధోనీ 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈసారి సంజూ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతం అయింది. దీనివల్ల ధోనీకి బ్యాటింగ్ చేసే అవకాశాలు మరింత తగ్గే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. "ఈసారి 14 మ్యాచ్‌లలో బహుశా మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే ధోనీకి బ్యాటింగ్ చేసే అవకాశం రావచ్చు. మిగతా సమయాల్లో అతను చివరి ఓవర్లలోనే కనిపిస్తాడు. అతని ప్రధాన పాత్ర వికెట్ కీపింగ్, ఫీల్డ్ సెట్టింగ్, రుతురాజ్‌కు సలహాలు ఇవ్వడమే" అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ, కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే.