Mark Rutte: ఇరాన్ పై అమెరికా చర్యలకు నాటో మద్దతు

NATO Supports US Action Against Iran Says Mark Rutte
షార్ట్స్‌లో చూడండి
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై సైనిక దాడులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ప్రకటించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలను ఆయన బహిరంగంగా సమర్థించారు. ఇరాన్ చేపడుతున్న అణు, క్షిపణి కార్యక్రమాల వల్ల ఐరోపా భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో ఉద్రిక్తతల విషయంలో నాటో తమకు మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ విషయాన్ని అమెరికా ఎప్పటికీ మర్చిపోదని తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే మార్క్ రుట్టే స్పందించారు.

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంలో నాటో కూటమి పాత్రను రుట్టే సమర్థించారు. గతంలో యుద్ధ సమయంలో టర్కీ వైపు దూసుకొచ్చిన మూడు బాలిస్టిక్ క్షిపణులను నాటో విజయవంతంగా అడ్డుకుందని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా, అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకల భద్రతకు తమ కూటమి చర్యలు తీసుకుంటోందని వివరించారు.
Go Back to Shorts
Mark Rutte
Iran
NATO
Donald Trump
Nuclear Program
Missile Program
Europe Security
Middle East Crisis
Hormuz Strait
Turkey

More Telugu News