Pemmasani Chandrasekhar: జగన్ పై పెమ్మసాని కౌంటర్ అటాక్

Pemmasani Chandrasekhar Counter Attacks Jagan on Personal Attacks
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు, బాడీ షేమింగ్ వంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గుంటూరులోని బీఆర్ స్టేడియం అభివృద్ధి పనులకు నిన్న శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిస్తే తాము బాడీ షేమింగ్‌ చేయగలం కానీ సంస్కారం అడ్డు వస్తుందని పెమ్మసాని అన్నారు. మీలా ఏది పడితే అది మాట్లాడలేమన్నారు. బుధవారం జగన్ సీఎం చంద్రబాబు ముఖం గురించి మాట్లాడారని, అంతకుముందు తమ మైండ్‌ సెట్‌ బాగాలేదని వ్యాఖ్యానించారని పెమ్మసాని గుర్తుచేశారు. రాష్ట్రం గురించి ఏదైనా మాట్లాడాలని ఉంటే రాజకీయాలు మాట్లాడండి. సబ్జెక్ట్‌ గురించి మాట్లాడండి. అంతే కానీ, వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.

గతంలో ప్రజావేదికను కూల్చడం, పట్టాదారు పాసుపుస్తకాలపై సొంత ఫొటో ముద్రించడం, మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ మృతికి కారణమవడం ఎలాంటి మైండ్‌సెట్‌కు నిదర్శనమని జగన్‌ను పెమ్మసాని ప్రశ్నించారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన కొనియాడారు.
Go Back to Shorts
Pemmasani Chandrasekhar
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Body Shaming
Guntur
BR Stadium
Praja Vedika
Doctor Sudhakar
TDP

More Telugu News