Boman Irani: ఇరాన్ ప్రజలు చనిపోతుంటే మీరెక్కడున్నారు?: నటుడు బోమన్ ఇరానీపై మందనా కరీమి ఆగ్రహం
ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ పోస్ట్ చేసిన ఓ హాస్య వీడియో వివాదానికి దారితీసింది. ఇరాన్‌తో చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బోమన్ చేసిన ఈ వీడియోపై, ఇరాన్ నటి మందనా కరీమి తీవ్రంగా స్పందించారు. ఆయన టైమింగ్‌ను, సున్నితత్వం లేని హాస్యాన్ని ఆమె తప్పుపట్టారు.
ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో, ట్రంప్ శాంతి చర్చలకు సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. దీనిపై బోమన్ ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, "ట్రంప్ ఇరానీలతో మాట్లాడాలనుకుంటున్నారు. బహుశా నాతో, స్మృతి ఇరానీతో, అరుణా ఇరానీతో చర్చలు జరుపుతారేమో. శాంతి కోసం నేను దేనికైనా సిద్ధం" అని అన్నారు. "అయితే నేను వాషింగ్టన్ వెళ్లను, ట్రంపే తన బృందంతో దాదర్‌లోని మా పార్శీ కాలనీకి రావాలి. మేం మంచి భోజనం పెడతాం. కానీ వారు వచ్చేటప్పుడు ఓ పెద్ద గ్యాస్ సిలిండర్ తెస్తే, మా అందరి జీవితాలు సులభమవుతాయి" అని హాస్యంగా వ్యాఖ్యానించారు.
ఈ వీడియోపై పలువురు సెలబ్రిటీలు నవ్వుతున్న ఎమోజీలతో స్పందించగా, 'బిగ్‌బాస్' ఫేమ్, ఇరాన్ నటి మందనా కరీమి మాత్రం ఘాటుగా కామెంట్ చేశారు. "బోమన్ ఇరానీ గారూ.. చాలా ఆసక్తికరమైన టైమింగ్. ఏళ్లుగా ఇరాన్‌లో ప్రజలను అరెస్టు చేస్తున్నారు, ఉరితీస్తున్నారు. వేలమంది చనిపోయారు. నా లాంటి వాళ్లు ఆ బాధను అనుభవించి, దాని గురించి మాట్లాడాం. ఇరానీలు చనిపోతున్నప్పుడు మీ గొంతు ఎక్కడ ఉంది? ఇప్పుడు గ్యాస్, రాజకీయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నందునే స్పందిస్తున్నారా? మౌనంగా ఉండడం నుంచి వ్యంగ్యం దాకా మీరు చాలా వేగంగా మారారు" అని ఆమె విమర్శించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్‌లో ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం పడుతోందన్న వార్తల నేపథ్యంలో బోమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా కారణాల రీత్యా తాను భారత్‌ను విడిచి వెళ్తున్నట్లు మందనా ఇటీవల ప్రకటించడం గమనార్హం.