మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి .. కీలక ఆదేశాల జారీ
- మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు
- ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశం
- గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని సూచన
ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు.