సంగీత లోకంలో నిశ్శబ్దం: రోడ్డు ప్రమాదంలో బ్లూగ్రాస్ లెజెండ్ రోనీ బోమాన్ కన్నుమూత!

తన అద్భుతమైన గాత్రంతో, భావోద్వేగపూరితమైన పాటలతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ అమెరికన్ గాయకుడు రోనీ బోమాన్ (64) తుదిశ్వాస విడిచారు. గత శనివారం మధ్యాహ్నం టెన్నెస్సీలోని ఆష్‌ల్యాండ్ సిటీ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్ ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలైన ఆయన్ను వెంటనే నాష్‌విల్లేలోని వాండర్‌బిల్ట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.


రోనీ బోమాన్ ప్రస్థానం:

  • అవార్డుల రికార్డు: ఇంటర్నేషనల్ బ్లూగ్రాస్ మ్యూజిక్ అసోసియేషన్ (IBMA) నుంచి మూడుసార్లు ‘మేల్ వోకలిస్ట్ ఆఫ్ ది ఇయర్’ (1995, 1998, 1999) అవార్డులను అందుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

  • లోన్‌సమ్ రివర్ బ్యాండ్: 1990 నుంచి 2001 వరకు ఈ ప్రముఖ బ్యాండ్‌లో వోకలిస్ట్, బేస్ ప్లేయర్‌గా ఉండి, 90వ దశకంలో బ్లూగ్రాస్ మ్యూజిక్ కొత్త పుంతలు తొక్కేలా చేశారు.

  • టాప్ సాంగ్ రైటర్: కేవలం గాయకుడిగానే కాకుండా, అద్భుతమైన పాటల రచయితగా కూడా రోనీ రాణించారు. ఆయన రాసిన పాటలను హాలీవుడ్ అగ్రశ్రేణి కంట్రీ మ్యూజిక్ స్టార్లు క్రిస్ స్టేపుల్టన్, కెన్నీ చెస్నీ, జార్జ్ స్ట్రెయిట్ వంటి వారు ఆలపించడం విశేషం. ముఖ్యంగా కెన్నీ చెస్నీ పాడిన ‘నెవర్ వాంటెడ్ నథింగ్ మోర్’ వంటి చార్ట్‌బస్టర్ సాంగ్ వెనుక రోనీ కలం ఉంది.


రోనీ మృతి వార్త తెలియగానే బిలీ స్ట్రింగ్స్, జాన్ కార్టర్ క్యాష్, డీర్క్స్ బెంట్లీ వంటి ప్రముఖ సంగీతకారులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. "ఆయన గదిలోకి వస్తే వెలుగు నిండేది.. బ్లూగ్రాస్ లోకంలో ఒక గొప్ప శకం ముగిసింది" అంటూ అభిమానులు నివాళులర్పిస్తున్నారు.



More Telugu News