Mahesh Kumar Goud: ముఖ్యమంత్రి పదవిపై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి పదవి అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని జోస్యం చెప్పారు. తమ పార్టీల నుంచి బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావులకు చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు.
బీజేపీ నాయకులు బీసీ వ్యతిరేకులు అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం డిక్లరేషన్ ప్రకటించి చట్టం చేసిందని అన్నారు. ప్రభుత్వం అందరికీ సన్నబియ్యం ఇస్తోందని, ఇది చారిత్రాత్మకమని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బియ్యం దోపిడీ జరిగిందని ఆరోపించారు.