విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ అత్యంత కఠినంగా స్పందించింది. తమ దేశంలోని విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతిదాడి చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) సంచలన ప్రకటన చేసింది. కేవలం సైనిక స్థావరాలే కాకుండా, ఆయా ప్రాంతాల్లోని అమెరికా అనుబంధ ఐటీ వ్యవస్థలు, తాగునీటి శుద్ధి కేంద్రాలను కూడా ధ్వంసం చేస్తామని తీవ్రంగా హెచ్చరించింది.
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని వచ్చే 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లను నామరూపాల్లేకుండా చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ జ్వాలలు రాజుకున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ ఘాటుగా స్పందించారు. తమ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే ఈ ప్రాంతంలోని కీలక వ్యవస్థలన్నీ కోలుకోలేని విధంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. అంతేకాకుండా, తమ విద్యుత్ కేంద్రాలను పునర్నిర్మించే వరకు హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని, ఒక్క చమురు ట్యాంకర్‌ను కూడా ముందుకు కదలనివ్వబోమని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది.
ఈ సంక్షోభం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా పడింది. గత ఫిబ్రవరి 28 నుంచి జలసంధి మూతపడటంతో ఇంధన సరఫరా నిలిచిపోయి, బ్యారెల్ ముడిచమురు ధర ఇప్పటికే 119 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మరోవైపు, ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగిస్తుండగా, లెబనాన్ నుంచి హెజ్బొల్లా దాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత ముదురుతోంది.
తాజా సమాచారం ప్రకారం ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో వైట్ హౌస్ అధికారులు మిత్రదేశాలతో అత్యవసర చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ తీరానికి సమీపంలో అమెరికా బాంబర్ విమానాలు గస్తీని ముమ్మరం చేశాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.