డాక్టర్ వందన హత్య కేసు.. టీచర్‌కు జీవిత ఖైదు
- డాక్టర్ వందన దాస్ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం
- టీచర్ సందీప్‌కు జీవితాంతం జైలు శిక్ష విధించిన కోర్టు
- తీర్పుపై అసంతృప్తి.. ఉరిశిక్ష కోసం హైకోర్టుకు కుటుంబం
- ఇది 'అత్యంత అరుదైన కేసు' అంటున్న ప్రాసిక్యూషన్
2023 మే 10న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ గొడవలో గాయపడిన సందీప్‌ను పోలీసులు వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకురాగా, అక్కడే సర్జికల్ కత్తెరతో డాక్టర్ వందనపై దాడి చేసి 27 సార్లు పొడిచి చంపాడు. నిందితుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు నాటకమాడినప్పటికీ, పక్కా ప్రణాళికతోనే ఈ హత్య జరిగిందని కోర్టు నిర్ధారించింది.
అయితే, ఈ తీర్పుపై బాధితురాలి కుటుంబం, ప్రాసిక్యూషన్ అసంతృప్తి వ్యక్తం చేశాయి. నిందితుడికి మరణశిక్ష విధించాలని కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించాయి. ఇది "అత్యంత అరుదైన కేసు" (Rarest of Rare) కిందకు వస్తుందని, కాబట్టి ఉరిశిక్షే సరైనదని వారు వాదిస్తున్నారు.