బుజ్జగింపులు విఫలం.. 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు సరైన గౌరవం లభించడం లేదన్న తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, కాంగ్రెస్‌ను వీడాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది.
ఈ సంక్షోభాన్ని నివారించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర హైకమాండ్ ప్రతినిధులు కూడా ఫోన్‌లో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే, వారి ప్రతిపాదనలను జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. "సారీ శ్రీధర్, లక్ష్మణ్" అంటూ, తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ నెల 25వ తేదీన తన అనుచరులతో కలిసి మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు జీవన్ రెడ్డి ముహూర్తం ఖరారు చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం జగిత్యాలలో ఓ ఫంక్షన్ హాల్‌ను కూడా బుక్ చేశారని చెబుతున్నారు. "దేవుడు శాసించాడు.. మానవుడు అనుసరిస్తాడు" అని తన కార్యకర్తల వద్ద వ్యాఖ్యానించడం ఆయన నిర్ణయం ఎంత నిశ్చయంగా ఉందో సూచిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి హెచ్చరించడంతో అధిష్ఠానం ఈ విషయాన్ని మరింత తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయన్ను బుజ్జగించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా జగిత్యాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తన తుది నిర్ణయాన్ని నేడు (ఆదివారం) అధికారికంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు.