'ధురంధర్' దర్శకుడు ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అని తెలుసా?
బాలీవుడ్‌లో ఇప్పుడు 'ధురంధర్ 2' సృష్టించిన ప్రభంజనం గురించి చర్చ జరుగుతోంది. విడుదలైన రెండు రోజులకే వందల కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్ర దర్శకుడే ఆదిత్య ధర్. అయితే, కేవలం మూడే సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ప్రయాణం ఎందరికో ఆదర్శం. ఆయన మొదట సినిమా ఇండస్ట్రీకి రావాలనుకోలేదు, టీమిండియాకు క్రికెట్ ఆడాలని కలలు కన్నారు.
ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆదిత్య ధర్, కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి క్రికెటర్‌గా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఢిల్లీ అండర్-19 జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. అయితే, 2002లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ జట్టు ఎంపికలో రాజకీయాల వల్ల తనకు అన్యాయం జరిగిందని భావించి, ఎంతో ఇష్టపడిన క్రికెట్‌కు శాశ్వతంగా దూరమయ్యారు.
ఆ తర్వాత రచయితగా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. పలు చిత్రాలకు రచయితగా, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తూ దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నారు. 2019లో 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా, 'హౌ ఈజ్ ద జోష్' అనే డైలాగ్‌ను దేశవ్యాప్తంగా మార్మోగేలా చేసింది. తొలి చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకొని రికార్డు సృష్టించారు.
ఆ తర్వాత తన సోదరుడితో కలిసి నిర్మాణ సంస్థను స్థాపించి, తన భార్య యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో 'ఆర్టికల్ 370' చిత్రాన్ని నిర్మించి విజయం అందుకున్నారు. గతేడాది విడుదలైన 'ధురంధర్', తాజాగా వచ్చిన 'ధురంధర్ 2' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలుగా నిలిచాయి.
ముఖ్యంగా 'ధురంధర్ 2' వందల కోట్ల క్లబ్‌లో చేరి ఆదిత్యను అగ్ర దర్శకుల సరసన నిలబెట్టింది. 'ఉరి' సినిమా షూటింగ్ సమయంలో నటి యామీ గౌతమ్‌తో ప్రేమలో పడి, 2021లో వివాహం చేసుకున్నారు. వీరికి 2024లో ఒక కుమారుడు జన్మించాడు. మొత్తంగా, క్రికెటర్‌గా రాణించలేకపోయినా, సినిమా రంగంలో తన ప్రతిభతో బాక్సాఫీస్‌ను శాసిస్తున్న దర్శకుడిగా ఆదిత్య ధర్ నిలిచారు.