జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తానంటే భుజాలపై మోసుకుని వస్తాను: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Telangana
Advertisement
  • జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని కొద్దిరోజులుగా ప్రచారం
  • జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వస్తానంటే సాదరంగా స్వాగతిస్తానన్న సంజయ్ కుమార్
  • జీవన్ రెడ్డి చాలా మంచి మనిషి అని కితాబు
Advertisement
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అంటే తనకు చాలా గౌరవం ఉందని, ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే తాను వెళ్లి నా భుజాల మీద మోసుకుని వస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని గత కొద్దిరోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడే విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. కానీ ఏ పార్టీలో చేరతారనే విషయం ఇంకా వెల్లడించలేదు. అయితే బీఆర్ఎస్‌లోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జీవన్ రెడ్డి తమ పార్టీలోకి (బీఆర్ఎస్) వస్తానంటే సాదరంగా స్వాగతిస్తానని అన్నారు. ఆయన చాలా మంచి మనిషి అని, ఆయన అంటే తనకు గౌరవం ఉందని అన్నారు. 

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఒక్కసారి ఎమ్మెల్యే గెలవని వాళ్లు కూడా వచ్చి నలుగురు గన్‌మెన్లు కావాలని అడుగుతున్నారని, కానీ జీవన్ రెడ్డి మాత్రం అందుకు మినహాయింపు అని అన్నారు. ఆయన దగ్గర అవినీతి అనేదే లేదని అన్నారు. అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తే సంతోషంగా స్వాగతిస్తానని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే తర్వాత ఆయన కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్నారు. సంజయ్ కుమార్ జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో జోక్యం చేసుకుంటున్నారని జీవన్ రెడ్డి కొంతకాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Advertisement

సంబంధిత వార్తలు

Jeevan ReddyBRS partySanjay KumarTelangana politicsJagityalaCongress partyTelangana political news

More Telugu News

అమెరికా సెనేట్‌కు తొలి ముస్లిం.. కర్ణాటకతో బలమైన బంధం

05 Nov, 08:46

అమెరికా కాంగ్రెస్ డెమోక్రాట్ల కైవసం.. హెచ్‌1బీ వీసాలపై భారతీయులకు ఆశలు!

05 Nov, 08:32

అగ్రరాజ్యంలో మనోళ్ల ప్రభంజనం.. ఎన్నికల్లో 30 మందికి పైగా ఘన విజయం

05 Nov, 08:16

11 ఏళ్ల తర్వాత పాడినా చిక్కులే.. 'మాతృభూమి' పాటతో ఇరుక్కున్న సల్మాన్

05 Nov, 08:11

మురసు తుపాను ఎఫెక్ట్.. వాయిదా పడ్డ కేఆర్‌ఎంబీ భేటీ

05 Nov, 08:03

పలు దేశాల్లో గూగుల్ ఉద్యోగులకు ఎగ్జిట్ ఆఫర్.. కారణం ఇదే!

05 Nov, 08:01

ఏపీలో పరిషత్ పోరు.. ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

05 Nov, 07:44

రాప్తాడు బాలికకు ఆపరేషన్ విజయవంతం: మంత్రి లోకేశ్

05 Nov, 07:28

జో రూట్‌పై సచిన్ ప్రశంసల జల్లు.. వన్డే ఫార్మాట్‌ను మార్చాల్సిందేనంటూ కొత్త ప్రతిపాదన

05 Nov, 07:16

ఇరాన్ యుద్ధమే రిపబ్లికన్లను ముంచింది: అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్

05 Nov, 07:10

పరిషత్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాలి.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ

05 Nov, 06:59

మా ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం.. అయినా మళ్లీ అదే చేస్తా: ట్రంప్

05 Nov, 06:57

జియో సంచలనం.. రూ. 15కే రోజంతా అన్‌లిమిటెడ్ 5G డేటా!

05 Nov, 06:43

మురసు తుపాను ప్రభావం: ఆరు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా

05 Nov, 06:43

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సగానికి పైగా తగ్గనున్న మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలు!

05 Nov, 06:26
..More Telugu News