కబ్జా చేసి ఫామ్ హౌస్ కడితే కచ్చితంగా కూల్చివేస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

కబ్జా చేసి ఫామ్ హౌస్ కడితే కచ్చితంగా కూల్చివేస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

HYDRA Commissioner Ranganath Warns of Farmhouse Demolitions on Encroached Land
  • మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదన్న రంగనాథ్
  • కబ్జాలకు పాల్పడిన వారిని వదిలి పెట్టబోమని హెచ్చరిక
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హైడ్రాపై రెఫరెండంగా జరిగిందని వ్యాఖ్య
మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కానీ ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఫామ్ హౌస్ కడితే అది ఎవరిదైనా కచ్చితంగా కూల్చివేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన ఆయన, చెరువులు, కుంటల కబ్జాల వెనుక ఎంతటివారు ఉన్నా వదిలి పెట్టబోమని హెచ్చరించారు. దుర్గం చెరువు విషయానికి వస్తే హైడ్రా రాకముందే అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.

నల్లకుంట, మాసాబ్ ట్యాంకు, కృష్ణానగర్ ఇలా పలు ప్రాంతాల్లో కబ్జాలు జరిగాయని, అన్నింటిపై దృష్టి సారించామని తెలిపారు. కబ్జాదారులను వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు నివసించే ప్రాంతాలను మాత్రం ముట్టుకోబోమని హామీ ఇచ్చారు. హైడ్రా దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హైడ్రాకు రెఫరెండంగా జరిగిందని వ్యాఖ్యానించారు.

హైడ్రాపై విమర్శలు, ఆరోపణలు చేసిన వారికి వ్యతిరేకంగా ఈ ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరు హైడ్రాను మెచ్చుకుంటారని రంగనాథ్ అన్నారు.
Advertisement
Ranganath HYDRA
HYDRA Commissioner
Telangana government
Land encroachment
Farmhouse demolition

More Telugu News