Natanz: ఇరాన్‌లోని నతాంజ్ అణుకేంద్రంపై మరోసారి దాడి
ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేశాయి. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అణుశుద్ధి కేంద్రంపై వైమానిక దాడులు జరిగాయని తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. అయితే రేడియా ధార్మిక పదార్థాల లీకేజీ జరగలేదని, పరిసర ప్రాంతాల నివాసితులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొంది.
నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఇరాన్ అణు ఇంధన సంస్థ ఖండించింది. నేరపూరిత చర్యల్లో భాగంగానే నతాంజ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడులు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, ఇతర అణు భద్రత నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది.
తాము జరిపిన దాడులతో ఇరాన్‌కు భారీ నష్టం జరిగిందని, ఇక ఆ దేశానికి యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యం లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో కూడా నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై ఒకసారి దాడి జరిగింది.