Vijay Thalapathy: విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న... కమల్ హాసన్ ఏమన్నారంటే?

Kamal Haasan responds to question about Vijays party and political competition
షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు విజయ్ పార్టీని స్థాపించడం, తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించిన తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీతో పొత్తు చర్చలు తదితర అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు విజయ్ పార్టీ గురించి ప్రశ్నించారు.

పెరంబూర్ నుంచి విజయ్ పోటీ చేసే అవకాశముందని, దీని గురించి మీరు ఏం చెబుతారని మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు కమల్ హాసన్ నవ్వుతూ, "ఆ విషయాలు నాకెందుకు? నాకు చాలా పనులు ఉన్నాయి, వాటిపైనే దృష్టి పెట్టాలి" అని బదులిచ్చారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సహనటుడు రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు శుభాకాంక్షలు తెలియజేయడం కనీస మర్యాద అని, కానీ నిర్లక్ష్యంగా మాట్లాడటం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కమల్ హాసన్ ఇంకా మాట్లాడుతూ, రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్‌లతో కలిసి తాను నటిస్తున్న చిత్రంపై స్పందించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని అన్నారు. తనకు రాజకీయంగా చాలా పనులు ఉన్నాయని, అలాగే సినిమాల్లో నటించాల్సి ఉందని వెల్లడించారు.
Go Back to Shorts
Vijay Thalapathy
Kamal Haasan
Tamil Nadu Politics
Vijay Party
Tamil Nadu Elections
DMK
Perambur

More Telugu News