Vivek Oberoi: నా జీవితంలోని చీకటి రోజుల్లో అమ్మే అండ.. ఆమె ఒడిలో తలపెట్టి చిన్నపిల్లాడిలా ఏడ్చా: వివేక్ ఒబెరాయ్
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన తల్లిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక హృద్యమైన పోస్ట్ చేశారు. తన జీవితంలో ఎదురైన అత్యంత క్లిష్టమైన, చీకటి రోజుల్లో తన తల్లి ఎలా అండగా నిలిచిందో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రపంచం ముందు ధైర్యంగా నటిస్తున్నప్పటికీ, లోలోపల ఎంతగా కుమిలిపోయానో, ఆ సమయంలో అమ్మ తనలో ఎలా ధైర్యం నింపిందో పంచుకున్నారు.
"కొన్నేళ్ల క్రితం నా జీవితంలో అత్యంత చీకటి అధ్యాయం నడుస్తోంది. గోడలన్నీ నాపైకి కూలుతున్నట్లు అనిపించేది. ప్రపంచం ముందు ధైర్యంగా కనిపించడానికి ప్రయత్నించినా, లోపల మాత్రం నేను పూర్తిగా కుమిలిపోయాను. ఆ సమయంలో పూర్తిగా అలసిపోయిన నేను ఎప్పటిలాగే మా అమ్మ దగ్గరికి వెళ్లాను. చిన్నపిల్లాడిలా ఆమె ఒడిలో తలపెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాను. 'అమ్మా, నాకే ఎందుకిలా జరుగుతోంది?' అని అడిగాను" అని వివేక్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఆ సమయంలో తన తల్లి ఎలాంటి సానుభూతి మాటలు చెప్పలేదని, కేవలం ఒకే ఒక్క ప్రశ్నతో తన ఆలోచనా ధోరణిని మార్చేసిందని వివేక్ తెలిపారు. "ఆమె నా తల నిమురుతూ, 'నాయనా, నీకు అవార్డులు వచ్చినప్పుడు ఎప్పుడైనా ‘నాకే ఎందుకు?’ అని అడిగావా? లక్షల మంది నీ పేరును ఉచ్ఛరిస్తున్నప్పుడు ఈ ప్రశ్న వేసుకున్నావా?' అని అడిగింది. ఆ ఒక్క ప్రశ్నతో ఆమె నాలోని నటుడిని, స్టార్‌ను పక్కనపెట్టి, కేవలం తన కొడుకుతో మాట్లాడింది. నా ఆత్మను తాకింది. అదే అమ్మలోని మ్యాజిక్. మన బలహీనతలను చూసి, వాటినే మన బలంగా మార్చగల ఏకైక వ్యక్తి అమ్మ" అని వివేక్ భావోద్వేగంగా రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా జపాన్‌లోని ఓ సామెతను కూడా ప్రస్తావించారు. ప్రతి మనిషికి మూడు ముఖాలు ఉంటాయని, ఒకటి ప్రపంచానికి, రెండోది స్నేహితులు, కుటుంబానికి చూపిస్తామని, కానీ ఎవరికీ చూపించని మూడో ముఖమే మన అసలైన స్వరూపమని, ఆ ముఖాన్ని చూడగలిగేది బహుశా అమ్మ మాత్రమేనని అన్నారు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను తన భార్య ప్రియాంకలో చూస్తున్నానని, తమ పిల్లల విషయంలో ఆమె కూడా ఒక అద్భుతమైన తల్లిగా ఉందని కొనియాడారు.
ఈ పోస్ట్‌తో పాటు తన తల్లితో దిగిన కొన్ని ఫొటోలను కూడా వివేక్ షేర్ చేశారు. ఒక ఫొటోలో తన తల్లిని ఆప్యాయంగా కౌగిలించుకోగా, మరో ఫొటోలో చిన్నప్పుడు తల్లి తనను ముద్దాడుతున్న దృశ్యం ఉంది. 'కంపెనీ' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వివేక్ ఒబెరాయ్, 'సాథియా', 'యువ' వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.