4 గంటల సినిమా అయినా సీటుకు అతుక్కుపోతారు: ‘ధురంధర్ 2’పై రాజమౌళి ప్రశంసలు
తాజాగా విడుదలైన 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రంపై ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని చెబుతూ, నటుడు ఆర్. మాధవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
"దేశ ప్రజల నిస్సహాయతను, ఆవేదనను మీరు అద్భుతంగా పండించారు. మీ విజయాన్ని మా విజయంగా భావించాం" అని మాధవన్‌ను ట్యాగ్ చేస్తూ రాజమౌళి పేర్కొన్నారు. మొదటి భాగాన్ని ఎంతగానో ఇష్టపడ్డానని, కానీ రెండో భాగం దానిని మించి స్కేల్, సోల్ పరంగా అద్భుతంగా ఉందని కొనియాడారు. "రచన, నటీనటుల ఎంపిక, సాంకేతికత, సంగీతం, దర్శకత్వం.. ఇలా అన్నీ దోషరహితంగా ఉన్నాయి. కానీ, సినిమాను నిలబెట్టింది దానిలోని భావోద్వేగాలే" అని జక్కన్న వివరించారు.
దర్శకుడు ఆదిత్య ధర్‌ను అభినందిస్తూ, "4 గంటల నిడివితో సినిమా తీయడం, విడుదల చేయడం చాలా ధైర్యం కావాలి. చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోతారు" అని అన్నారు. నటుడు రణ్‌వీర్ సింగ్ నటనను కూడా మెచ్చుకున్నారు. "ఓ సన్నివేశంలో రణ్‌వీర్ నటన యాక్టింగ్‌లో ఒక మాస్టర్‌క్లాస్. సినిమా ఆరంభం నుంచి క్లైమాక్స్ వరకు మంత్రముగ్ధుల్ని చేశారు" అని జక్కన్న ప్రశంసించారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన మొదటి భాగం ఘన విజయం సాధించింది. ఈ నెల 19న విడుదలైన ‘ధురంధర్ 2’ ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, రాకేశ్ బేడీ, అర్జున్ రాంపాల్, సారా అర్జున్‌తో పాటు మాధవన్ కీలక పాత్ర పోషించారు.