Matchmaker: కాబోయే భార్య ఉద్యోగం చేయాలి.. ఇంటినీ చక్కదిద్దుకోవాలని కోరుకోవడం అత్యాశే!: ప్రముఖ మ్యాచ్‌మేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Modern Men Should Share Household Workload Matchmaker Suggests
షార్ట్స్‌లో చూడండి
ఆధునిక సమాజంలో వివాహ బంధాలపై ఓ ప్రముఖ మ్యాచ్‌మేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం చేస్తూ కెరీర్‌లో రాణిస్తున్న మహిళలు ఇంటి పనులన్నీ సంప్రదాయ గృహిణిలా చక్కదిద్దాలని పురుషులు ఆశించడం అత్యాశే అవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి అవాస్తవిక అంచనాలు సరికావని హితవు పలికారు. చాలా మంది పురుషులు తమకు కాబోయే భార్య బాగా సంపాదించాలని, ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు.

అదేసమయంలో ఆమె పాతకాలం పద్ధతిలో ఇంటి బాధ్యతలన్నీ మోయాలని ఆశిస్తున్నారని, ఇది సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. నేటి జీవనశైలిలో స్త్రీ, పురుషులిద్దరూ కెరీర్‌పై దృష్టి పెడుతున్నారని, అలాంటప్పుడు ఇంటి పనులను కూడా సమానంగా పంచుకోవాలని సూచించారు.

కేవలం భార్యపైనే ఈ భారం మోపడం వల్ల కొత్త జంటల మధ్య తీవ్ర మనస్పర్థలు తలెత్తుతున్నాయని, కొన్ని సందర్భాల్లో ఇది విడాకుల వరకు దారితీస్తోందని ఆమె హెచ్చరించారు. పురుషులు తమ భాగస్వామి నుంచి ఏం ఆశిస్తున్నారనే విషయంలో వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. ఆర్థికంగా స్వాతంత్ర్యం ఉన్న మహిళలు, పాతకాలం నాటి కట్టుబాట్లు, ఆంక్షలకు లోబడి ఉండబోరనే విషయాన్ని పురుషులు గుర్తుంచుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
Go Back to Shorts
Matchmaker
Marriage
Modern Society
Working Women
Household Chores
Gender Roles
Expectations
Divorce
Financial Independence
Career

More Telugu News