Shabbir Ali: తెలంగాణ బడ్జెట్‌ను స్వాగతించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
తెలంగాణ బడ్జెట్‌పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. ఈ బడ్జెట్ రైతులు, సంక్షేమం, సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించిందని అన్నారు. మైనారిటీల సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది సమ్మిళిత వృద్ధిపట్ల ప్రభుత్వం నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. మైనారిటీల కోసం గత సంవత్సరం బడ్జెట్లో కంటే ఈసారి రూ.178 కోట్లు అధికంగా కేటాయించారని ప్రశంసించారు.
మైనారిటీ మహిళలకు 10,000 కుట్టు మిషన్ల పంపిణీ, 4,655 మంది మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి కార్యక్రమాలు ఆర్థిక స్వావలంభనకు తోడ్పడుతాయని పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల ఉపాధి అవకాశాలను ఇవి మెరుగుపరుస్తాయని ఆయన తెలిపారు. ఈ బడ్జెట్లో మైనారిటీల విద్య, వ్యాపారాల అభివృద్ధి, ఆర్థిక స్వావలంభనకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.