ఆన్‌లైన్ జూదానికి చెక్... మరో 300 యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం వేటు
ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం తన ఉక్కుపాదాన్ని కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న మరో 300 గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను తాజాగా బ్లాక్ చేసింది. దీంతో ఇప్పటివరకు బ్లాక్ చేసిన వాటి సంఖ్య 8,400కు చేరిందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.
బ్లాక్ చేసిన వాటిలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు, రౌలెట్, స్లాట్స్ వంటివి అందించే ఆన్‌లైన్ క్యాసినోలు, బెట్టింగ్ ఎక్స్ఛేంజ్‌లు ఉన్నాయి. వీటితో పాటు సట్టా/మట్కా నెట్‌వర్క్‌లు, నిజమైన డబ్బుతో ఆడే కార్డ్ గేమ్ యాప్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గతేడాది ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించిన 'ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, 2025' కింద ఈ చర్యలు తీసుకుంటున్నారు. 2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త చట్టం తర్వాతే సుమారు 4,900 వెబ్‌సైట్లను బ్లాక్ చేయడం గమనార్హం. ఈ చట్టం ప్రకారం... పోకర్, రమ్మీ, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి నిజమైన డబ్బుతో కూడిన గేమ్‌లను అందిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధిస్తారు. ఈ పరిశ్రమను నియంత్రించేందుకు 'ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా'ను కూడా ఏర్పాటు చేశారు.
ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడం, యువత వ్యసనాలకు బానిసలు కావడం, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు పాల్పడటం వంటి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా 'గేమింగ్ డిజార్డర్'ను ఒక ఆరోగ్య సమస్యగా గుర్తించింది.
అయితే, ఈ చట్టం అన్ని ఆన్‌లైన్ గేమ్‌లను వ్యతిరేకించడం లేదు. ఈ-స్పోర్ట్స్, సురక్షితమైన సోషల్, ఎడ్యుకేషనల్ గేమ్‌లను ప్రోత్సహిస్తోంది. లాభాల ఆశ చూపి వినియోగదారులను దోపిడీ చేసే బెట్టింగ్, గ్యాంబ్లింగ్ గేమ్‌లకు, నైపుణ్యాన్ని పెంచే గేమ్‌లకు మధ్య స్పష్టమైన తేడాను ఈ చట్టం చూపిస్తోంది.