Ali Mohammad Nayyini: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి మృతి

Ali Mohammad Nayyini Killed in Israel Strikes on Iran
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) మరోసారి ఇరాన్‌పై విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) అధికార ప్రతినిధి, పబ్లిక్ రిలేషన్స్ హెడ్ అలీ మహ్మద్ నయీనీని హతమార్చినట్లు శుక్రవారం ప్రకటించింది.

గత రెండేళ్లుగా ఐఆర్‌జీసీకి ప్రధాన ప్రచారకర్తగా నయీనీ పనిచేస్తున్నారని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులను ప్రోత్సహించేలా మధ్యప్రాచ్యంలోని ఉగ్రసంస్థలకు ఇరాన్ పాలన యంత్రాంగం యొక్క ఉగ్రవాద ప్రచారాన్ని వ్యాప్తి చేశారని ఆరోపించింది. మరోవైపు, పవిత్ర రంజాన్ మాసం చివరి గంటల్లో అమెరికా-ఇజ్రాయెల్ ఉగ్రదాడిలో తమ అధికార ప్రతినిధి బ్రగేడియర్ జనరల్ అలీ మహ్మద్ నయీనీ 'అమరుడయ్యారని' ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఇది పిరికిపంద చర్య అని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది.

ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్... ఇరాన్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులనే లక్ష్యంగా చేసుకుంటోంది. బుధవారం టెహ్రాన్‌లో జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతీబ్‌ను హతమార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అంతకుముందు, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని కూడా హతమార్చినట్లు ప్రకటించింది. మార్చి 17న టెహ్రాన్‌లో జరిగిన దాడిలో లారిజానీ తన కుమారుడితో కలిసి మరణించినట్లు ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది.

అంతేకాకుండా, బసిజ్ పారామిలిటరీ దళాల యూనిట్ కమాండర్ ఘోలామ్‌రెజా సోలేమానీని కూడా హతమార్చినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్‌లో పౌర ప్రదర్శనకారులపై హింసకు, అణచివేతకు సోలేమానీ నాయకత్వం వహించారని ఐడీఎఫ్ ఆరోపించింది. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ కీలక అధికారులను కోల్పోతుండటం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
Go Back to Shorts
Ali Mohammad Nayyini
Iran
Israel
IDF
IRGC
Middle East Conflict
Islamic Revolutionary Guard Corps
Israel Defense Forces
Tehran
Gholamreza Soleimani

More Telugu News