Hyderabad Traffic: హైదరాబాదులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారం జరుపుకునే జమ్మాత్-ఉల్-విదా ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం (మార్చి 20) చారిత్రాత్మక మక్కా మసీదుతో పాటు సికింద్రాబాద్‌లోని జామా మసీదు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు ప్రకటించారు.
వివరాల ప్రకారం, చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. చార్మినార్ నుంచి మదీనా, ముర్గీ చౌక్, శాలిబండ వైపు వెళ్లే ప్రధాన రహదారులను పూర్తిగా మూసివేస్తున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. శాలిబండ, నాగులచింత వైపు నుంచి వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద హరిబౌలి వైపు పంపిస్తారు. చౌక్ మైదాన్ ఖాన్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కోట్లా అలీజా వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను అఫ్జల్‌గంజ్ బస్టాప్ వద్దే నిలిపివేయనున్నారు. ప్రార్థనల కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం సౌత్ జోన్ పరిధిలో ఆరు చోట్ల ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
అదేవిధంగా, సికింద్రాబాద్‌లోని జామా మసీదు వద్ద కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సుభాష్ రోడ్డును మూసివేసి, రాణిగంజ్, ప్యారడైజ్ వైపు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. జమ్మాత్-ఉల్-విదా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఐచ్ఛిక సెలవు ప్రకటించింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.