Addanki Dayakar: తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వ విప్‌ల నియామకం
తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను రాష్ట్ర ప్రభుత్వం విప్‌లుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు.
ఇక, అసెంబ్లీ విప్‌లుగా ముగ్గురు ఎమ్మెల్యేలను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విప్‌లుగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు.