LPG: అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు చేసేందుకు కేంద్రం యోచన

LPG India to Consider Gas Imports from US Amid Crisis
షార్ట్స్‌లో చూడండి
ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం కారణంగా సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నప్పటికీ, అమెరికా వంటి దేశాల నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)ను కొనుగోలు చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.

గురువారం నాడు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, "యుద్ధ పరిస్థితుల కారణంగా ఆందోళన ఉన్నప్పటికీ, ఏ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా గ్యాస్ కొరత లేదు. సిలిండర్ల డెలివరీ సాధారణంగానే కొనసాగుతోంది" అని తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు తగ్గి ప్యానిక్ బుకింగ్ కూడా తగ్గిందని, బుధవారం ఒక్కరోజే దాదాపు 57 లక్షల రీఫిల్ బుకింగ్‌లు వచ్చాయని ఆమె వివరించారు. దేశంలో ముడిచమురు పరిస్థితి, రిఫైనరీ కార్యకలాపాలు కూడా సాధారణంగానే ఉన్నాయని చెప్పారు.

మధ్యప్రాచ్యంలో పరిణామాలు భారత్‌పై ప్రభావం చూపుతాయని, అందుకే హార్ముజ్ జలసంధిలో ఆంక్షల నేపథ్యంలో భారత్ ఇప్పటికే గల్ఫ్ దేశాలపై ఆధారపడటం తగ్గించుకుందని సుజాత శర్మ తెలిపారు. ప్రస్తుతం 70 శాతం ముడి చమురును అమెరికా, రష్యా, నైజీరియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఆమె గుర్తుచేశారు.

అదే సమయంలో, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు. దేశవ్యాప్తంగా 6,000 దాడులు నిర్వహించగా, ఉత్తరప్రదేశ్‌లో 1,000, మధ్యప్రదేశ్‌లో 2,300 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా, పశ్చిమాసియా జలాల్లో భారత నౌకలు, నావికులు సురక్షితంగా ఉన్నారని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా తెలిపారు.
Go Back to Shorts
LPG
LPG Gas
Gas Cylinders
India Gas Import
Sujata Sharma
Petroleum Ministry
US Gas
Crude Oil
Middle East Crisis
Refill Booking

More Telugu News