'ధురంధర్ 2' .. అదే దూకుడు!

రణ్ వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2'. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 'ధురంధర్' సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే సీక్వెల్ ఇంత త్వరగా వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఫస్టు పార్టు గురించి ఆడియన్స్ మాట్లాడుకుంటూ ఉండగానే, సీక్వెల్ థియేటర్లలోకి దిగిపోవడం విశేషం. 

భారత్ ను దెబ్బకొట్టడానికి పాకిస్థాన్ వ్యూహాలు పన్నడం .. ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి సీక్రెట్ ఏజెంట్ గా హీరో ఆ దేశంలో అడుగుపెట్టడం .. అక్కడ ఆయనకి ఎదురైన పరిస్థితులతో ఫస్టు పార్టు సాగుతుంది. హీరోకి జరిగిన అన్యాయం .. అందుకు సంబంధించిన ప్రతీకారంతో సీక్వెల్ మొదలవుతుంది. ఫస్టు పార్టుకి ఏ మాత్రం తగ్గకుండా సీక్వెల్ ఉందనే టాక్ థియేటర్స్ దగ్గర బలంగా వినిపిస్తోంది. కంటెంట్ పై గల నమ్మకంతో 4 గంటల నిడివితో ఈ సినిమాను వదలడం విశేషం. 

'ధురంధర్ 2'లో ఫస్టాఫ్ ఓ మాదిరిగా అనిపించినప్పటికీ, సెకండాఫ్ లో కథ పుంజుకుందని చెబుతున్నారు. దేశభక్తితో కూడిన సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించాయని అంటున్నారు. అక్కడక్కడా కాస్త నిదానించినప్పటికీ, ఆ తరువాత వచ్చే ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సన్నివేశాలు థియేటర్స్ ను ఊపేస్తున్నాయని చెబుతున్నారు. రణ్ వీర్ సింగ్ తన పాత్రలో జీవించాడనీ, సీక్వెల్ కూడా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 



More Telugu News