Shehbaz Sharif: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు!
ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న పాకిస్థాన్, తన 'రిపబ్లిక్ డే' (మార్చి 23) వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది అధికారిక వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం ప్రకటించింది. ఆడంబరాలకు పోకుండా కేవలం జెండా ఆవిష్కరణకే ఈ వేడుకలను పరిమితం చేయాలని నిర్ణయించారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీనివల్ల పాకిస్థాన్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశం తీవ్ర ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటోంది. ఈ విపత్తును తట్టుకోవడానికి మార్చి నెలలో ప్రభుత్వం ప్రకటించిన 'పొదుపు చర్యల'లో భాగంగానే ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.