Ali Larijani: ఒకే ఒక్క పొరపాటు.. మొసాద్ వలలో ఇరాన్ వ్యూహకర్త లారిజానీ ఎలా చిక్కారంటే..!
ఇరాన్ అగ్రశ్రేణి నాయకుడు, కీలక వ్యూహకర్త అలీ లారిజానీని ఇజ్రాయెల్ హతమార్చింది. టెహ్రాన్ శివార్లలోని తన కుమార్తె నివాసానికి ఆయన రహస్యంగా వెళ్లినప్పుడు ఈ దాడి జరిగింది. దేశ సుప్రీం లీడర్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా ఉన్న లారిజానీ మరణం ఇరాన్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ, తరచూ నివాసాలు మారుస్తూ లారిజానీ శత్రువు కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే, మార్చి 17వ తేదీ రాత్రి ఆయన తన కుమార్తె ఇంటికి వెళ్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా సంస్థ 'మొసాద్' పక్కా సమాచారం సేకరించింది. ఆ ఇంట్లోకి ఆయన ప్రవేశించిన కొన్ని క్షణాల్లోనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి.
ఈ భీకర దాడిలో భవనం పూర్తిగా కుప్పకూలిపోవడంతో, అలీ లారిజానీతో పాటు ఆయన కుమారుడు మొర్తెజా, కార్యాలయ అధిపతి బయట్ కూడా అక్కడికక్కడే మరణించారు. ఇరాన్ వ్యూహాలకు వెన్నెముకగా ఉన్న లారిజానీని అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 28న సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ కీలక సమయంలో దేశ అణు కార్యక్రమాలు, విదేశీ సంబంధాల్లో చక్రం తిప్పే లారిజానీ మరణం ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బగా అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ దాడిపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పందిస్తూ "లారిజానీ, ఆయన అనుచరులు ఇప్పుడు నరకంలో ఉన్నారు" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఈ ఘటనను తమ దేశ చరిత్రలోనే అతిపెద్ద నిఘా వైఫల్యంగా ఇరాన్ పరిగణిస్తోంది. తమ అగ్రనేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది.