Revanth Reddy: ఢిల్లీలో ఎదురుపడిన సీఎం రేవంత్ రెడ్డి, వైసీపీ నాయకురాలు రోజా

Revanth Reddy and Roja meet in Delhi
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా ఢిల్లీలో ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు రోజా పార్లమెంటు భవనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు తారసపడ్డారు.

రోజాను పలకరించిన రేవంత్ రెడ్డి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డితో వెంట ఉన్న నాయకులు ఏదో ప్రశ్నించగా, తాను పని మీద వచ్చానని ఆమె సమాధానం చెప్పారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని రోజా పలకరించారు.
Go Back to Shorts
Revanth Reddy
Roja
Telangana CM
YS Jagan
Andhra Pradesh
Delhi
Nitin Gadkari
Parliament

More Telugu News