అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు
- 500 కోట్ల భోజనాలు అందించిన అక్షయపాత్ర ఫౌండేషన్
- కేంద్రం నుంచి పీఎం పోషణ్ పురస్కారం అందుకున్న సంస్థ
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
- ఫౌండేషన్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు
- సంస్థ కృషికి తగిన గుర్తింపు లభించిందని ప్రశంస
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందిస్తూ... పిల్లల ఆకలి తీర్చి, పాఠశాలల్లో వారి హాజరును పెంచేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ పురస్కారం ఫౌండేషన్ ఛైర్మన్ మధు పండిత్ దాస, వైస్ ఛైర్మన్ చంచలపతి దాస, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ రీజినల్ ప్రెసిడెంట్ వంశధార దాసతో పాటు యావత్ సిబ్బంది కృషికి లభించిన తగిన గుర్తింపు అని అన్నారు. ఫౌండేషన్ యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.