Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు మాస్కోలో చికిత్స? రష్యా ఏం చెబుతోందంటే...!
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (56) ఆరోగ్యంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన, మెరుగైన చికిత్స కోసం మాస్కోలోని ఆసుపత్రిలో చేరారంటూ వెలువడిన ఓ కథనం సంచలనం సృష్టిస్తోంది. ఈ పరిణామం ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత ఆసక్తి రేపుతోంది.
కువైట్‌కు చెందిన 'అల్-జరీదా' అనే వార్తాపత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌కు ఫోన్ చేసి వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని, ఆ తర్వాతే మొజ్తబాను ప్రత్యేక సైనిక విమానంలో మాస్కోకు తరలించారని ఆ పత్రిక పేర్కొంది.
అయితే, ఈ వార్తలపై రష్యా స్పందించలేదు. ఇలాంటి కథనాలపై తాము ఎప్పుడూ వ్యాఖ్యానించబోమని రష్యా అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.
మరోవైపు, ఇరాన్ విదేశాంగ శాఖ ఈ వార్తలను తోసిపుచ్చింది. మొజ్తబా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన అమెరికా-ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన కూడా విడుదల చేశారని తెలిపింది. అసలు ఇరాన్ కొత్త నాయకుడు బతికే ఉన్నారో లేదో కూడా తమకు తెలియదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.
గత నెల ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో మొజ్తబా తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. అదే దాడిలో మొజ్తబాకు తీవ్ర గాయాలయ్యాయాయని అమెరికా చెబుతోంది. అతడి రూపురేఖలు మారిపోయి ఉండొచ్చని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యానించారు. ఈ దాడిలో మొజ్తబా భార్య, కుమారుడు ఈ దాడిలో మృతిచెందారు.
ఇరాన్‌తో రష్యాకు ఉన్న బలమైన సంబంధాల నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలీ ఖమేనీ హత్యను 'క్రూరమైన చర్య'గా పుతిన్ ఖండించడమే కాకుండా, ఇరాన్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. ప్రస్తుతానికి మొజ్తబా ఆరోగ్యంపై పూర్తి స్పష్టత లేనప్పటికీ, మాస్కోలో చికిత్స పొందుతున్నారనే ఊహాగానాలు మాత్రం కొనసాగుతున్నాయి.