Supreme Court: దత్తత తల్లులకు సుప్రీంకోర్టు ఊరట... పితృత్వ సెలవులపైనా కీలక ఆదేశాలు
దత్తత తీసుకునే తల్లులకు మెటర్నిటీ సెలవుల విషయంలో ఉన్న ఆంక్షలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో దేశంలో పితృత్వ సెలవులను ఒక సామాజిక భద్రతా ప్రయోజనంగా గుర్తిస్తూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఇది దేశవ్యాప్తంగా ఉద్యోగుల హక్కులపై జరుగుతున్న చర్చలో ఒక ముఖ్యమైన పరిణామం.
జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. 'సోషల్ సెక్యూరిటీ కోడ్, 2020'లోని సెక్షన్ 60(4)ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ కొట్టివేసింది. ఈ నిబంధన ప్రకారం మూడు నెలల కంటే తక్కువ వయసు ఉన్న శిశువును దత్తత తీసుకున్న తల్లులకు మాత్రమే ప్రసూతి సెలవులు వర్తిస్తాయి. ఈ నిబంధన సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని, ఇది వివక్షాపూరితమని కోర్టు అభిప్రాయపడింది.
"దత్తత తీసుకున్న బిడ్డ అవసరాలు, కన్నబిడ్డ అవసరాలకు ఏమాత్రం భిన్నంగా ఉండవు. పిల్లల సంరక్షణలో తండ్రులను కూడా సమాన భాగస్వాములుగా గుర్తించాలి" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పితృత్వ సెలవులు, వాటి వ్యవధి వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ విధాన పరిధిలోకి వస్తాయని చెబుతూనే, దీనిపై ఒక స్పష్టమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ అవసరాన్ని నొక్కి చెప్పింది.
దత్తత తీసుకున్న తల్లులకు 12 వారాల ప్రసూతి సెలవులను పరిమితం చేస్తూ 2017లో 'మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961'లో చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం అర్హులైన మహిళలకు 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అందుబాటులో ఉండగా, పితృత్వ సెలవులకు సంబంధించి దేశంలో ఎలాంటి ప్రత్యేక చట్టం లేదు. తాజా తీర్పుతో దత్తత తీసుకున్న పిల్లల వయసుతో సంబంధం లేకుండా తల్లులు పూర్తి ప్రసూతి ప్రయోజనాలు పొందేందుకు మార్గం సుగమమైంది.