Vairamuthu: వైరముత్తుకు పవన్ అభినందనలు... ఆ విషయం మీకు తెలియదేమో అంటూ చిన్మయి శ్రీపాద ఘాటు వ్యాఖ్యలు

Pawan Kalyan Congratulates Vairamuthu Chinmayi Sripada Criticizes
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ తమిళ కవి, సినీ గేయ రచయిత వైరముత్తుకు ఆయన తెలిపిన శుభాకాంక్షలపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అభినందనలు చెప్పడమేంటని ఆమె ప్రశ్నించారు.

జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైనందుకు వైరముత్తుకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వైరముత్తు సాహితీ సేవలను కొనియాడుతూ, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం దక్కాలని ఆకాంక్షించారు.

పవన్ కల్యాణ్ పోస్ట్‌పై స్పందించిన చిన్మయి, "గౌరవంతో చెబుతున్నా... పవన్ కల్యాణ్ గారికి ఆ కవి గురించి ఎలాంటి ఐడియా లేదనుకుంటా. తమను లైంగికంగా వేధించాడని ఎందరో మహిళలు ఆరోపించిన వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషంగా ఉండాలని పవన్ గారు కోరుతున్నారు. అతను ఎలాంటి వాడో పవన్ కు సొంత ఆఫీస్ వాళ్లైనా చెప్పాలి" అని వ్యాఖ్యానించారు. ఒక సినీ గేయ రచయితకు ఇంతమంది రాజకీయ నాయకులు ఎందుకు శుభాకాంక్షలు చెబుతున్నారో అర్థం కావడం లేదంటూ ఆమె చురకలు అంటించారు.

గతంలో 'మీటూ' ఉద్యమం సమయంలో వైరముత్తుపై చిన్మయి సహా పలువురు మహిళలు తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. '

Vairamuthu
Pawan Kalyan
Chinmayi Sripada
Gnanpith Award
Me Too Movement
Sexual Harassment Allegations
Tamil Poet
Lyricist
AP Deputy CM

More Telugu News