R Madhavan: వీడెవడో నకిలీగాడు.. నటుడు మాధవన్ అలర్ట్

R Madhavan Alerts Fans About Fake Account
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తన అభిమానులను, నెటిజన్లను ఓ ఫేక్ అకౌంట్ విషయంలో అప్రమత్తం చేశారు. సోషల్ మీడియాలో తన పేరు వాడుకుంటూ కొందరు వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని, అది పూర్తిగా మోసపూరిత చర్య అని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టిన మాధవన్, ఆ ఫేక్ అకౌంట్‌కు తనకు గానీ, తన టీమ్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. "ఫ్రాడ్ అలర్ట్... ఈ వ్యక్తికి నాతో గానీ, నా బృందంతో గానీ ఎలాంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో నా తరఫున మాట్లాడుతున్నట్లు నటిస్తున్నాడు. ఇది పూర్తిగా ఫేక్ అకౌంట్, దయచేసి జాగ్రత్తగా ఉండండి" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అభిమానులు మోసపోకుండా ఉండేందుకు సదరు ఫేక్ అకౌంట్ స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన పంచుకున్నారు. ఈ మోసానికి పాల్పడుతున్న వ్యక్తిపై చట్టపరంగా సరైన చర్యలు తీసుకుంటున్నామని మాధవన్ తెలిపారు.

ఇక సినిమాల విషయానికొస్తే, మాధవన్ నటించిన ‘ధురందర్-2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆయన ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ షాట్ చిత్రీకరణకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని ఆయన ఇటీవల పంచుకున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ ఆ షాట్‌ను ఎండగా ఉన్న రోజున తీయాలనుకున్నారని, కానీ తాను సెట్‌లోకి వచ్చిన ప్రతిసారీ భారీ వర్షం కురవడంతో, ఆ వాతావరణంలోనే చిత్రీకరించారని తెలిపారు. అయితే, ఆ వాతావరణం షాట్‌కు మరింత బాగా సరిపోయిందని మాధవన్ వివరించారు.


R Madhavan
Madhavan
Actor Madhavan
R Madhavan fake account
Dhruvan-2
Aditya Dhar
IB Director Ajay Sanyal
Fraud alert
Social media fraud

More Telugu News