Ustaad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ టైమ్ ఫిక్స్

Pawan Kalyans Ustaad Bhagat Singh Trailer Release Time Fixed
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి.

పవన్ కెరీర్‌లో 'గబ్బర్ సింగ్' ఒక మైలురాయిగా నిలిచిపోయింది. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే దర్శకుడు హరీశ్‌ శంకర్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటమే ఈ హైప్‌కు ప్రధాన కారణం.

ట్రైలర్ విడుదలపై మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ‘గత్తర లేపేద్దాం’ అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల‌ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ విడుదలతో మేక‌ర్స్‌ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేయనున్నారు.
Ustaad Bhagat Singh
Pawan Kalyan
Harish Shankar
Sreeleela
Devi Sri Prasad
Gabbar Singh
Telugu Movie
Trailer Release
Ugadi Release
Raashi Khanna

More Telugu News