అధికారంతో ఉద్యమాన్ని ఆపలేరు: కోమటిరెడ్డి
అధికారంతో ఉద్యమాన్ని ఆపాలని చూస్తే అది ఇంకా ఎక్కువవుతుందే తప్ప తగ్గదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు సీమాంధ్రుల కనుసన్నల్లో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. పోలీసుల అత్యుత్సాహం కారణంగా సామాన్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చిందని కోమటిరెడ్డి అన్నారు.