ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు: ఇర్ఫాన్ పఠాన్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీకి రాబోయే ఐపీఎల్ సీజనే చివరిది కావొచ్చని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. చెన్నై జట్టుకు ధోనీ ప్రాముఖ్యతను వివరిస్తూ, అతను లేకుండా సీఎస్కేను, ఐపీఎల్‌ను ఊహించుకోవడం చాలా కష్టమని అన్నాడు.
జియో హాట్‌స్టార్‌తో మాట్లాడుతూ ఇర్ఫాన్ పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ధోనీ లేనిదే సీఎస్కే అసంపూర్ణం. ఈ సీజన్‌లోనే అతడిని చివరిసారిగా ఎల్లో జెర్సీలో చూస్తామేమో. డ్రెస్సింగ్ రూమ్‌లో అతని ఉనికి జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, భవిష్యత్తు కోసం మరో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ధోనీ పాత్ర చాలా కీలకం. అతను ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడో కచ్చితంగా చెప్పలేను, కానీ జట్టును ఐక్యంగా ఉంచడంలో సాయపడతాడు" అని వివరించాడు.
ధోనీ ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ వంటి విషయాల్లో సీఎస్కే యాజమాన్యం జాగ్రత్తగా వ్యవహరిస్తుందని పఠాన్ పేర్కొన్నాడు. ఆరోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి తమ అభిమాన ‘తలా’కు ఘనమైన వీడ్కోలు పలకాలని జట్టు యాజమాన్యం గట్టిగా కోరుకుంటుందని జోస్యం చెప్పాడు.
ఐదుసార్లు టైటిల్ అందించిన ధోనీ, సీఎస్కే నాయకత్వ బృందంలో ఇప్పటికీ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గత సీజన్‌లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన ధోనీ, ఇప్పటివరకు 278 మ్యాచ్‌లలో 38.80 సగటుతో 5,439 పరుగులు చేశాడు.