Chandrababu Naidu: ప్రకృతి సాగు రైతు రోశయ్యను ప్రశంసించిన సీఎం చంద్రబాబు
- గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన రైతు రోశయ్య
- కేవలం 75 సెంట్లలో 52 రకాల పంటలు పండిస్తున్న వైనం
- రోశయ్య విజయగాథ స్ఫూర్తిదాయకమంటూ ఎక్స్‌లో సీఎం పోస్ట్
- 2016 నాటి ప్రోత్సాహంతోనే రోశయ్య ప్రకృతి సాగు ప్రారంభించారని వెల్లడి
గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆదర్శ రైతుపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న అత్తోట గ్రామ రైతు రోశయ్యకు తన ప్రణామాలు తెలియజేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. 80 ఏళ్ల వయసులోనూ వ్యవసాయంలో ఆయన చూపిస్తున్న స్ఫూర్తిని కొనియాడారు.
గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామానికి చెందిన రైతు రోశయ్య తనకున్న 75 సెంట్ల భూమిలో ఏకంగా 52 రకాల పంటలను సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రకృతి సేద్య విధానంలో పండిస్తున్న ఈ పంటల ద్వారా ఆయన నెలకు రూ. 20 వేలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన సీఎం చంద్రబాబు.. "భూమిని తల్లిలా భావించి ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు రోశయ్య గారికి నా ప్రణామాలు. ఎనభై ఏళ్ల వయసులో ఆయన విజయగాథ ఎంతో స్ఫూర్తిదాయకం" అని తన పోస్టులో పేర్కొన్నారు.
2016లో తమ ప్రభుత్వం ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలతో ప్రేరణ పొందే రోశయ్య ఈ సాగును మొదలుపెట్టారని చంద్రబాబు గుర్తుచేశారు. రోశయ్య సాధిస్తున్న విజయాలు ఆదర్శమని పేర్కొంటూ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.