Chandrababu: జిల్లాలను ప్రమోట్ చేయండి... పెట్టుబడులను ఆకర్షించండి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu directs collectors to promote investments
  • పెట్టుబడుల ఆకర్షణకు కలెక్టర్లకు సీఎం చంద్రబాబు 3సీ ఫార్ములా
  • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కలెక్టర్లకు ర్యాంకులు ఇస్తామని ప్రకటన
  • విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా మూడు ప్రత్యేక ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కేవలం సంబంధిత శాఖల పనే కాదని, ఇకపై జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడిదారులను గుర్తించి, ఒప్పించి, వారికి అన్ని విధాలా సహకరించేందుకు 'కమిట్‌మెంట్, కన్విన్స్, కో-ఆపరేట్' అనే 3సీ ఫార్ములాను ఆయన నిర్దేశించారు. పెట్టుబడుల విషయంలో కలెక్టర్ల పనితీరును అంచనా వేసి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ఆధారంగా ర్యాంకులు ఇస్తామని ప్రకటించారు. అమరావతిలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు పెట్టుబడులు, పర్యాటక రంగాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... "పెట్టుబడులు వస్తేనే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రజల తలసరి ఆదాయం వృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు వేగంగా కార్యరూపం దాల్చేలా చూడాలి. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రత్యేక ఆర్థిక రీజియన్లుగా అభివృద్ధి చేస్తున్నాం. ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధి బాధ్యతను ప్రత్యేక అధికారులకు అప్పగించాం. ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులు యుద్ధ ప్రాతిపదికన జరగాలి" అని ఆదేశించారు. ఓర్వకల్లు, కొప్పర్తి వంటి ప్రాంతాలను ప్రధాన పారిశ్రామిక హబ్‌లుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని, అమర్ రాజా వంటి సంస్థలను కూడా వేధించి పంపించారని చంద్రబాబు విమర్శించారు. "గతంలో మేం హైదరాబాద్‌ను మోస్ట్ లివబుల్ సిటీగా, పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాం. ఇప్పుడు అదే తరహా ఎకో సిస్టమ్‌ను రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్నాం" అని వివరించారు.


Chandrababu
Andhra Pradesh investments
district collectors
tourism development
Amaravati
industrial hubs
Ease of Doing Business
job creation
economic growth
Amara Raja

More Telugu News