తమిళనాడులో దారుణం.. పన్నెండో తరగతి విద్యార్థిని దారుణ హత్య.. అత్యాచారం జరిగినట్లు అనుమానం!
- విలాతికుళం సమీపంలో పొదల్లో పడి ఉన్న మృతదేహం
- బాలికపై అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా
- ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
- నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థుల నిరసన
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా విలాతికుళం పరిధిలో దారుణం జరిగింది. పన్నెండో తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు వెతకగా, సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోని పొదల్లో ఆమె మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాలికపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో, నిందితులు బాలికను చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ ఘటన జిల్లావ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. బాలిక ఫోన్ కాల్ డేటా, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, ఈ అమానుష ఘటనకు నిరసనగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.