భారత్‌లో మళ్లీ అంబానీదే హవా.. ప్రపంచ కుబేరుడిగా మస్క్ రికార్డు!
- 9,970 కోట్ల డాలర్ల సంపదతో ఆసియా నంబర్ వన్‌గా ముకేశ్ అంబానీ
- జాబితాలో 15 మంది తెలుగు కుబేరులు
- 83,900 కోట్ల డాలర్ల ఆస్తితో ప్రపంచ సంపన్నడిగా మస్క్
- 3,910 కోట్ల డాలర్లతో సావిత్రి జిందాల్ రికార్డు
- దేశీ బిలియనీర్ల సంఖ్య 205 నుంచి 229కి చేరిక
- లక్ష కోట్ల డాలర్లకు చేరుకున్న భారత సంపన్నుల మొత్తం సంపద
ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్' తన 40వ వార్షిక ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది భారత్ నుంచి బిలియనీర్ల సంఖ్య భారీగా పెరగడం విశేషం. గతేడాది 205 మంది ఉండగా, ఈసారి ఆ సంఖ్య 229కి చేరింది. ఇందులో 30 మంది కొత్తగా ఈ క్లబ్‌లో చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 9,970 కోట్ల డాలర్ల సంపదతో భారత్, ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన పీఠాన్ని పదిలం చేసుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆయన 21వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 6,380 కోట్ల డాలర్ల నికర ఆస్తితో దేశంలో రెండో స్థానంలో ఉన్నారు. ఇక మహిళల విషయానికొస్తే ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్ 3,910 కోట్ల డాలర్ల ఆస్తితో దేశంలోనే అత్యంత ధనిక మహిళగా నిలిచారు.
గ్లోబల్ లీడర్లు వీరే..
ప్రపంచవ్యాప్తంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 83,900 కోట్ల డాలర్ల ఆస్తితో ఆయన వరుసగా రెండో ఏడాది ప్రపంచ నంబర్ వన్ ధనవంతుడిగా నిలిచారు. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద కూడా 27 శాతం వృద్ధి చెంది 650 కోట్ల డాలర్లకు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి 15 మంది
ఈసారి ఫోర్బ్స్ జాబితాలో తెలుగు వారి హవా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 15 మంది తెలుగు బిలియనీర్లు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. వీరిలో మెజారిటీ ఫార్మా రంగానికి చెందినవారే.
ప్రధాన తెలుగు కుబేరుల వివరాలు
మురళి దివి (దివీస్ ల్యాబ్స్): 1,010 కోట్ల డాలర్లు (తెలుగు వారిలో నంబర్ వన్)
జీఎం రావు (GMR గ్రూప్): 390 కోట్ల డాలర్లు
ప్రతాప్ సి రెడ్డి (అపోలో హాస్పిటల్స్): 360 కోట్ల డాలర్లు
బీ పార్థసారధి రెడ్డి (హెటిరో గ్రూప్): $340 కోట్లు
మహిమ దాట్ల (బయోలాజికల్-ఇ): 320 కోట్ల డాలర్లు
పీవీ రాంప్రసాద్ రెడ్డి (అరబిందో): 300 కోట్ల డాలర్లు
జూపల్లి రామేశ్వర రావు (మై హోమ్): 230 కోట్ల డాలర్లు
కృష్ణారెడ్డి & పిచ్చిరెడ్డి (మేఘా ఇంజనీరింగ్): వరుసగా 210 కోట్ల డాలర్లు, 200 కోట్ల డాలర్లు
భారత్ మూడో స్థానం
ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల్లో భారత్ తన మూడో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అమెరికా (989 మంది), చైనా (610 మంది) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత బిలియనీర్ల మొత్తం సంపద ఈ ఏడాది లక్ష కోట్ల డాలర్లకు (సుమారు రూ. 92 లక్షల కోట్లు) చేరుకోవడం ఒక మైలురాయిగా నిలిచింది.