ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగుస్తుంది.. నేనెప్పుడు అనుకుంటే అప్పుడే ఆగిపోతుంది: ట్రంప్

  • ఇరాన్‌లో లక్ష్యాలను ఛేదించామన్న ట్రంప్
  • ఇరాన్ వద్ద ఇంకా ఏమీ మిగలలేదని వ్యాఖ్య
  • యాక్సియోస్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో అన్ని లక్ష్యాలను ఛేదించామని ఆయన వెల్లడించారు. ఇరాన్ వద్ద ఇంకా ఏమీ మిగలలేదని అన్నారు. ఇరాన్‌తో త్వరలో యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు.

యాక్సియోస్‌తో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నేను ఎప్పుడు యుద్ధం ముగియాలనుకుంటే అప్పుడే ముగుస్తుందని అన్నారు. తమ ఆపరేషన్‌లో ఇరాన్ లక్ష్యాలను అన్నింటిని ఛేదించామని అన్నారు.

మరోవైపు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అంతకుముందు రోజు చేసిన వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయి. అవసరమైనంత వరకు, తమ లక్ష్యాలను సాధించే వరకు యుద్ధం కొనసాగుతుందని కాట్జ్ తెలిపారు. ఈ ఆపరేషన్‌ను ఇంత సమయంలో ముగించాలనే కాలపరిమితి ఏదీలేదని తెలిపారు.


More Telugu News