Iran Israel conflict: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం... అయోధ్యలో అన్నదాన కేంద్రంపై ప్రభావం

Iran Israel Conflict impacts Ayodhya Free Food Center
  • అమవా ఆలయంలోని రామ్ రసోయి అన్నదాన కేంద్రం తాత్కాలికంగా మూసివేత
  • వంట గ్యాస్ అందుబాటులో లేనందున కమ్యూనిటీ కిచెన్ అందుబాటులో లేదని వెల్లడి
  • అన్నదాన కేంద్రం వద్ద నోటీసులు
పశ్చిమాసియా దేశాల్లోని ఉద్రిక్తతల కారణంగా మన దేశంలో వంటగ్యాస్ కొరత తీవ్రమవుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం అయోధ్యను కూడా తాకింది. ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా అయోధ్య, రాంనగరి అమవా ఆలయంలోని రామ్ రసోయి అన్నదాన కేంద్రంను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు అన్నదాన కేంద్రం వద్ద నోటీసులు అంటించారు.

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేనందున కమ్యూనిటీ కిచెన్ అందుబాటులో లేదని అక్కడకు వచ్చిన భక్తులు చెబుతున్నారు. దైవ దర్శనం కోసం వచ్చానని, ఆ తర్వాత రామ్ రసోయిలో అన్నదానం చేస్తారని తెలిసి వచ్చానని కానీ వంట గ్యాస్ కొరత కారణంగా భోజనం తయారు చేయడం లేదని ఒక భక్తుడు తెలిపాడు.

మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ సమస్య తలెత్తిందని ఆలయ అధికారులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి వంట గ్యాస్ సమస్య ఉందని తెలిసిందని అన్నారు. అయితే ఈరోజు రామ్ రసోయి యథావిధిగా పని చేస్తుందని చెప్పడం గమనార్హం.

వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడుతున్న విషయం తెలిసిందే. ఎల్పీజీ కొరత వల్ల ఢిల్లీ హైకోర్టులోని క్యాంటీన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Iran Israel conflict
Ayodhya
Ram Mandir
Ram Rasoi
LPG shortage
cooking gas crisis
India gas supply

More Telugu News