మల్టీ మిలియన్ డాలర్ల కంపెనీ వంటి బ్రాండింగ్ డ్వాక్రా ఉత్పత్తులకు అవసరం: చంద్రబాబునాయుడు
- అమూల్ తరహాలో సహకార విధానంలో మార్కెటింగ్ జరగాలన్న ముఖ్యమంత్రి
- అమూల్ పాడి రైతుల భాగస్వామ్యంతో నడుస్తోందన్న ముఖ్యమంత్రి
- డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలు తప్పకుండా చెల్లిస్తారన్న ముఖ్యమంత్రి
మన దేశంలో మల్టీ మిలియన్ డాలర్ల కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో డ్వాక్రా ఉత్పత్తులకు అదే స్థాయిలో బ్రాండింగ్ తెచ్చేలా కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. 6వ జిల్లాల కలెక్టర్ల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్వాక్రా, మెప్మాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం పేరిట బ్రాండింగ్ చేశామని అన్నారు. దీని కోసం లోగోను సిద్ధంచేశామని అన్నారు.
అమూల్ తరహాలోనే సహకార విధానంలో ఉత్పత్తులకు మార్కెటింగ్ జరగాలని అన్నారు. అమూల్ పాడి రైతుల భాగస్వామ్యంతో నడుస్తోందని గుర్తు చేశారు. బిలియన్ డాలర్ల కంపెనీకి ఉన్నంత క్రెడిబులిటీ డ్వాక్రా మహిళలకు ఉందని అన్నారు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలను తప్పకుండా తిరిగి చెల్లిస్తారని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయని తెలిపారు.
ఇంతటి క్రెడిబులిటీ ఉన్న డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుందని అన్నారు. బ్రాండ్ లేకపోతే ఉత్పత్తి విలువ సగానికి తగ్గిపోతుందని అన్నారు. గ్లోబల్ మార్కెట్టుకు చేరేలా డ్వాక్రా ఉత్పత్తుల ప్రమాణాలు పెరగాలని అన్నారు. ఈ ఉత్పత్తులకు ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ కూడా ఉండేలా చూడాలని అన్నారు. 28 జిల్లాలు, 28 బ్రాండ్లను రూపొందించి పోటీని పెంచాలని సూచించారు. స్వయం బ్రాండ్ ఎస్టాబ్లిష్ కావాలంటే నాణ్యతా ప్రమాణాలే అత్యంత కీలకమని అన్నారు.