PM Kisan: ఈ నెల 13న పీఎం కిసాన్ నిధుల విడుదల
- రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ
- దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు లబ్ది
- గువాహటి వేదికగా రూ.19 వేల కోట్లు రిలీజ్ చేయనున్న మోదీ
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన నేపథ్యంలో శుక్రవారం గువాహటి వేదికగా నిధులు విడుదల చేస్తారని తెలిపింది. రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తోంది.
2019 లో ఎన్డీయే సర్కారు ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా.. ఏటా మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీ మొత్తం రూ.19 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు చొప్పున జమ అవుతాయని అధికారులు తెలిపారు.