పశ్చిమాసియాలో యుద్ధం.. దుబాయ్ నుంచి చెన్నై చేరుకున్న నటుడు అజిత్
- పదకొండు రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం
- యుద్ధం కారణంగా అజిత్ రాక ఆలస్యం
- మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ఎక్కువగా దుబాయ్‌లో ఉంటున్న అజిత్
ప్రముఖ నటుడు అజిత్ దుబాయ్ నుంచి భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గత కొన్నిరోజులుగా యుద్ధం కొనసాగుతోంది. పలువురు భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా భారత్ రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రొఫెషనల్ రేసర్ అయిన అజిత్ మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ఎక్కువగా దుబాయ్‌లో ఉంటున్నారు.
యుద్ధం కారణంగా దుబాయ్‌లో నిలిచిపోయిన వారిలో నటుడు అజిత్ కూడా ఉన్నారు. తాజాగా ఆయన చెన్నై చేరుకున్నారు. దుబాయ్ నుంచి ఆయన కొన్ని రోజుల క్రితమే రావాల్సి ఉంది. గగనతల ఆంక్షలు, విమానాలు నిలిచిపోవడం వంటి కారణాలతో ఇన్నిరోజులు రాలేకపోయారు.