ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా... వెంటనే పెరిగిన షేర్ల ధర
- వ్యక్తిగత కారణాలుగా పేర్కొన్నప్పటికీ, సంక్షోభం తర్వాతే ఈ నిర్ణయం
- గత డిసెంబర్‌లో ఇండిగో తీవ్ర ఆపరేషనల్ ఇబ్బందులు ఎదుర్కొన్న వైనం
- తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్న సహ వ్యవస్థాపకుడు రాహుల్ భాటియా
- సీఈఓ రాజీనామా వార్తతో 3 శాతం పైగా పెరిగిన ఇండిగో షేర్లు
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పీటర్ ఎల్బర్స్ తన పదవికి తక్షణమే రాజీనామా చేశారు. గత డిసెంబర్‌లో సంస్థ ఎదుర్కొన్న తీవ్రమైన ఆపరేషనల్ సంక్షోభం జరిగిన మూడు నెలలకే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. అయితే, రాజీనామాకు వ్యక్తిగత కారణాలను ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ఇండిగో సంస్థ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎల్బర్స్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
"వ్యక్తిగత కారణాల వల్ల సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నాను. నోటీస్ పీరియడ్‌ను మినహాయించాలని కోరుతున్నాను" అని ఎల్బర్స్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన రాజీనామాను ఇండిగో బోర్డు ఆమోదించింది. 2022 సెప్టెంబర్ నుంచి ఆయన అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపింది. కొత్త సీఈఓను నియమించే వరకు సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు.
గత ఏడాది డిసెంబర్‌లో ఇండిగో చరిత్రలోనే అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడం, గంటల తరబడి ఆలస్యమవ్వడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకానొక దశలో ఒకే రోజు 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. పైలట్ల కొరత, డీజీసీఏ కొత్త నిబంధనలు వంటివి ఈ సమస్యకు కారణమయ్యాయి. ఈ వైఫల్యాలపై అప్పట్లో ఎల్బర్స్ స్వయంగా క్షమాపణలు చెప్పగా, డీజీసీఏ ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.
కాగా, సీఈఓ రాజీనామా వార్తల నేపథ్యంలో ఇండిగో షేర్లు ఎన్ఎస్ఈలో 3.46 శాతం పెరిగి రూ.4,383.50 వద్ద ముగియడం విశేషం. పూర్తిస్థాయి సీఈఓ కోసం అన్వేషణ ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.