Iran War: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్... బెంగళూరు తర్వాత ముంబైలో 20 శాతం హోటళ్లు బంద్
- వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబైలో హోటళ్లు బంద్
- రాబోయే రెండు రోజుల్లో నగరంలో సగం హోటళ్లు మూతపడే అవకాశం
- ఢిల్లీ, బెంగళూరులలోను తాత్కాలికంగా హోటళ్లు బంద్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం నిత్యావసర వస్తువులపై భారీగా పడుతోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండటం లేదంటూ బెంగళూరులో హోటల్స్ అసోసియేషన్ ఈరోజు నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబైలో కూడా 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి.
ఈ మేరకు ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలో సగం హోటళ్లు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాణిజ్య సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీ, బెంగళూరు సహా వివిధ నగరాల్లో పలు హోటళ్లను తాత్కాలికంగా మూసివేశారు. సిలిండర్ల కొరత కారణంగా తమ వ్యాపారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. బ్లాక్‌లో విక్రయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.