Ramayana: 'రామాయణం' నుంచి రణబీర్, సాయి పల్లవి ఫొటోలు లీక్‌.. అసలు నిజం ఇదే!

Ranbir Kapoor Sai Pallavi Ramayana Photos Leaked Truth Revealed
  • రామాయణం షూటింగ్ ఫొటోలంటూ కొన్ని స్టిల్స్ వైరల్
  • అవి నకిలీవని స్పష్టం చేసిన చిత్ర యూనిట్
  • ఏఐ టెక్నాలజీతో సృష్టించిన ఫేస్-స్వాప్ చిత్రాలని వెల్లడి
  • రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్
  • ఈ ఏడాది దీపావళికి తొలి భాగం విడుదలయ్యే అవకాశం 
బాలీవుడ్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’కు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ‌ చక్కర్లు కొడుతున్నాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఉన్న ఈ ఫొటోలు సినిమా సెట్స్ నుంచి లీక్ అయ్యాయని ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంపై చిత్రబృందం స్పందించి, అవన్నీ నకిలీవని స్పష్టం చేసింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న చిత్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన ఫేస్-స్వాప్ చిత్రాలని చిత్రబృందం తెలిపింది. 2015లో వచ్చిన ‘సియా కే రామ్’ అనే టీవీ సీరియల్‌లోని స్టిల్స్‌ను ఉపయోగించి, అందులోని నటీనటుల ముఖాల స్థానంలో రణబీర్, సాయి పల్లవి ముఖాలను ఆకతాయిలు మార్ఫింగ్ చేసినట్లు వివరించింది. ఈ ఫొటోలకు, తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇక రావణుడి పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక పోస్టర్లను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
Ramayana
Ranbir Kapoor
Sai Pallavi
Nitesh Tiwari
Yash
Sunny Deol
Artificial Intelligence
AI
Siya Ke Ram
Bollywood

More Telugu News