మోదీ ఒక్క ఫోన్ చేస్తే చాలు ఈ యుద్ధం ఆగిపోతుంది.. యూఏఈ రాయబారి

  • ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు
  • రెండు దేశాల దేశాధినేతలతో మోదీకి సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడి
  • చర్చలకు మధ్యవర్తిత్వం చేయడానికి యూఏఈ సిద్ధంగా ఉందని వెల్లడి
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలకగల శక్తి ఒక్క భారతదేశానికే ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ దేశాధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీకి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ మీర్జా ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘మోదీ అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ ప్రతినిధులకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. ఈ సమస్య తక్షణమే పరిష్కారమవుతుంది. అంతటి గౌరవం ఆయనకు ఉంది’’ అని అన్నారు. గల్ఫ్ దేశాల నేతలతోనే కాకుండా, అక్కడి వ్యాపార వర్గాలు మరియు ప్రజల్లో కూడా మోదీకి మంచి క్రెడిబిలిటీ ఉందని ఆయన గుర్తుచేశారు.

మా భూభాగం యుద్ధానికి వేదిక కాదు

ఈ యుద్ధంలో యూఏఈ ప్రమేయంపై స్పందిస్తూ.. ‘‘యూఏఈ భూభాగాన్ని ఏ పక్షం కూడా లాంచింగ్ ప్యాడ్‌గా వాడుకోవడానికి మేం అనుమతించం’’ అని స్పష్టం చేశారు. అటు ఇరాన్ పొరుగు దేశంగా, ఇటు ‘అబ్రహం ఒప్పందం’ ద్వారా ఇజ్రాయెల్‌కు భాగస్వామిగా ఉన్న తమ దేశం.. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.



More Telugu News