MK Stalin: జమిలి ఎన్నికల వల్ల రాష్ట్ర ఎన్నికల ప్రాధాన్యత తగ్గుతుంది: ఎంకే స్టాలిన్

MK Stalin Simultaneous Elections Undermine State Importance
  • కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి అధికారాలన్నీ వెళతాయన్న స్టాలిన్
  • అసలు సమస్య కంటే దారుణమైన పరిణామాలకు దారితీస్తుందని ఆందోళన
  • జమిలి ఎన్నికలతో జాతీయస్థాయి పార్టీలకే ప్రయోజనమని ఆందోళన
వన్ నేషన్ వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) వల్ల రాష్ట్ర ఎన్నికల ప్రాధాన్యత తగ్గిపోతుందని, కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి అధికారాలన్నీ వెళతాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. జమిలి ఎన్నికల విధానంపై ఆయన స్పందిస్తూ, ఈ విధానం దేశానికి ఒక పరిష్కారం చూపిస్తుందేమో కానీ, అసలు సమస్య కంటే దారుణమైన పరిణామాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

లోక్ సభకు, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపడమంటే భారతదేశ సమాఖ్య నిర్మాణం, ప్రజాస్వామ్య వైవిధ్యం దెబ్బతింటుందని అన్నారు. రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాసినట్లవుతుందని విమర్శించారు. జమిలి ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయి పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ సమస్యలు, ప్రజల మనోభావాలు పక్కకు వెళతాయని అన్నారు. కేవలం ఖర్చు తగ్గుతుందనే కారణంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకూడదని అన్నారు.
MK Stalin
Tamil Nadu
One Nation One Election
Simultaneous Elections
Indian Federalism
State Elections

More Telugu News